27 అక్టో, 2010

భూమి తల్లి అన్నపూర్ణమ్మరా!

ఎవ్వరికి మరణ శిక్షలు వరమాలలుగా అవసరము లేదు
ఎ వోక్కరిని ఎన్కౌంటర్ భూతాలూ ఆవహించ పనిలేదు
ఆయేషాలూ,మనిషాలూ,వైష్ణవిలూ
బలవంతపు బాయిలర్లలో బుగ్గి కావాల్సిన పనిలేదు
ఏ ప్రభాకర్లూ గుండెలు పగిలి
చితి మంటల తోడుగా నింగికి పయనించాల్సిన పనిలేదు
తెలుగు నేలనేలంతా విలవిలలాడి పోతుంది
భూమి నుదిటిపై నాగలి సంతకం చేస్తే
గర్భం విచ్చుకుని విత్తనాలకై చేతులు చాస్తుంది
వాన జల్లు వొడిలో చేరితే పరవసించి మొక్కై శిరస్సు పైకే ఎత్తుతుంది
మొక్క పులకరిస్తే కంకులు పాలు పోసుకుంటాయి
అన్నపూర్ణ చేతులు సాచిన వానికి ఆకలి తీరుస్తుంది
భూమిని నమ్ముకోకుండా అమ్ముకు తింటూ ఉన్నందుకు
చిట్టి తల్లుల్ల్ని చిన్ని బాలల్ని బలి కోరుకుంటున్నది
ఒరే నాయనలారా రాజనాలు పండించే భూమిని
తులాభారం తూయకండిరా
పిల్లల మెడలకు నాగుబాములై చుట్టుకుంటాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి