ఊయల ఊగుతుందే
ముందుకూ వెనక్కూ
అల్లానే ఊగుతూ ఉండేదప్పుడు
నా గుండె కూడా అలసట లేకుండా
కవాటాలు తుత్తునియలు అయిపోతాయేమో
రక్తనాళాలు ఉత్కంఠ భరించలేక
విస్పోఠన చెందుతాయేమో నన్న
ఉత్కంఠ నిండి ఉండేది
అప్పుడు మోయడానికి
జ్ఞాపకాలు లేవు ఉట్టి గాయాలు తప్ప
అడుగు తీసి అడుగేద్దామంటే నిప్పులు కాల్తున్న భయం
అయినా సరే ఆపలేని మునివేళ్ళ మీద ప్రయాణం
ఒక్కోరోజు కుంపటి మీద కాగుతూ కూడా
పీడ కలల్ని భరించాల్సి వొచ్చేది
అప్పుడప్పుడైనా పంచుకుందామని దోసిలి నిండా
కలలు తీసుకునేవాణ్ణి
తల పైకెత్తి చూస్తే
కళ్ళ ముందు అంతా శూన్యం
ఎవరో చుట్టూ మూగి ఉన్నా
కళ్ల లోతుల్లో కనిపించని భావాల్ని
చదవలేని తడబాటు
గాయాల్నిలా మోసుకు తిరుగుతున్న కొద్దీ
కాలి బాట మరింత ఇరుకిరుగ్గా
ముళ్ళ పొదలతో తుప్పలతో
రాళ్ళూ రప్పలతో గీరుకుపోయిన
పచ్చి పుండు అయ్యేదేమో
ఇప్పటికైనా మేలుకోవడం మంచిదే అయ్యింది
ప్రాణాలైనా మిగిలి బ్రతికి బయట పడి పోయానుకదా
మంచికంటి గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు
రిప్లయితొలగించండిహారం