30 మే, 2011

ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి

ఇప్పుడు మాటలు కావాలి
మంచి ముత్యాలు జల్లులుగా కురిసే
మాటల మమతలు కావాలి
పెదాల అంచుల్లో పూసే సుగంధ పరిమళాలు కావాలి
గాలి సయ్యాటల్లో తేలియాడే
పరిమళాలు వెదజల్లే పూదోటలు కావాలి
ఆప్యాయంగా పలకరించే హృదయపు ఆలింగనాలు కావాలి
అశాంతి వెల్లువై పారే మనుషుల వృక్షాల కొమ్మ కొమ్మనూ వంచే
తేటతేట తేనె పలుకులు మల్లెలుగా కురవాలి
కన్నుల సందిట పూసే సిరిమువ్వలు గజ్జెలుగా రాలాలి
కాలం కావ్యాన్ని నవ్వించే మాటలు పాటలు కావాలి
మానవ స్పర్శలు పెంచే హృదయ వీణియలు మీటే
గట్టిమాటల మనుషులు కావాలి
వెల్లువల్లో కొట్టుకు పోయే మనుషుల్ని ఆపి కూర్చోబెట్టి
సేదతీర్చే మాటల లేపనాలు కావాలి
అవి ప్రసరించే ఎల్లలు లేని ఆనందాలు కావాలి

18 మే, 2011

అణువణువునా

కనిపించిన
ప్రతి కొమ్మా రెమ్మా పైనా
నీ చెక్కిలి గులాబి సంతకంతరచి తరచి చూస్తాను
ఎ పక్షి గొంతులో పాటై పగిలినా
అది నువ్వే కృతి చేసి మీటిన
సంగీతమేనని చెవులారా వింటాను
అర విరిసిన ఎ పువ్వును చూసినా
అది నువ్వు నవ్విన నవ్వేమో నని
ఆత్రంగా దోసిలి పడతాను

అబద్దం వెనుక నిజం

ఫట్ మని విరిగే కర్ర ముక్కలా
పుటుక్కుమని పగిలే కుండ పెంకులా
తటాలున తెగిపోయే చెప్పు వుంగ టంలా
పై నుండి రాలిపడే తాటి మట్టలా
నిజం వెంట అబద్దంలా అబద్దాన్నంటు కున్న నిజంలా
సుఖం వెనుక దుక్ఖం లా
బ్రతుకు పటాన్ని
మరణమేప్పుడూ అంటి పెట్టుకునే వుంటుంది
యాంత్రిక సామ్రాజ్యం మనిషికి
మంత్రించి ఇచ్చిన మణిహార వరమిది

దేశభక్తీ జిందాబాద్

పిల్లికి బిచ్చం పెట్టరు
గొంతు ఎండి పోయే వాడికి
గుక్కెడు నీళ్ళు పోయ్యరు
పక్క మనిషి చావు బతుకుల్లో వున్నా
కన్నెత్తి కూడా చూడరు
విరిగిన వేలుపై వుట్టి పుణ్యానికి
ఓంటేలైనా పోయ్యరు
పచ్చి నెత్తుర్లు తాగడానికి
కత్తులనైనా కౌగలించు కుంటారు
కొన్ని సారా పేకెట్ల కే జీవితాల్ని బలి తీసుకుంటారు
నమ్మిన వాడి మూలుగుల్నించి
రక్తాన్ని జలగల్లా పీల్చుకుంటారు
క్రికెట్ మార్కేట్టాట కొట్లాటలో
ఒకే ఒక్క విజయానికే
వీరంగాలు వేస్తారు
టపాకాయలు కాలుస్తారు
మిఠాయిలు పంచుతారు
తాగి తమ్దనాలాడతారు
జెండాలతో చిందులు వేస్తారు
నానా రకాల నజరానాలు ప్రకటిస్తారు
వహ్వా దేశభక్తి జిందాబాద్

17 ఏప్రి, 2011

శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక,సేవా సమితి

ఒంగోల్లో కొంతమంది మిత్రులం కలిసి శాంతివనం ఫౌండేషన్ స్థాపించాము. దీని ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటుగా వాళ్ళలో వున్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం,కథా సాహిత్యం చదివించడం,కథలు రాయించడం,మంచి పిల్లల సినిమాలు చూయించడం ,వాటి గురించి విశ్లేషణలు రాయించడం చేశాము పాఠశాలల్లో గ్రంథాలయాలు ప్రారంభించడం వంటి కార్యక్రమాలతో పాటుగా పేదపిల్లల ను దత్తత తీసుకుని వాళ్ళను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను కూడా తీసుకుని కాలక్రమములో శాంతివనం సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యం గా ఈ ఫౌమ్దేషణ్ ప్రారంభించాము. అక్కడ నుండే ప్రతిభావంతులైన ,బాధ్యతాయుతమైన పౌరుల్ని ,సామజిక బాధ్యత కలిగిన పిల్లలుగా తీర్చిదిద్దే బాధ్యత శాంతివనం స్వీకరించింది. ఇంకా భావ సారూప్యత కలిగిన మిత్రులను కూడా భాగస్వాములను చేసే వుద్దేశంతో సభ్యులనుగా చేర్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఈ సంస్థలో భ్హగాస్వాములు కావచ్చు,s

29 డిసెం, 2010

శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము

ది లక్ష్యాలతో శాంతివనం బ్లాగ్ మొదలైంది ..
మొదటి దశ
1. పాఠశాలల్లో,క్రిం కళాశాలల్లో, తెలుగు భాష వ్యాప్తికి కృషి చెయ్యడం.
2. విద్యార్థులచే కథలు చదివించడం,రాయించడం.
3. పుస్తకపఠనం పై ఆసక్తిని పెంపొందించడం
4. యువకులకు సమాజ అవగాహన కోసం కళాశాలల్లో చర్చా వేదికలు ఏర్పాటు చెయ్యడం
5. సమాజము సంస్కృతి పట్ల ప్రేరణ కలిగించడం
6. గృహిణులు, యువకుల నుండి రచయితలను ప్రోత్సహించడం
7. రచనల కోసం వర్క్ షాప్ లను ఏర్పాటు చెయ్యడం
8. పాఠకులను పెంపొందించడానికి సంచార గ్రంథాలయాన్ని నిర్వహించడం
9. పాఠకులకు అవసరమైన పుస్తకాలను అందచెయ్యడం
10. వారం వారం పిల్లలకు బుద్దివికాసము కలిగించే సృజనాత్మక కృత్యాలను ఏర్పాటు చేయుట
11. భాష, సాహిత్య ,సంగీత ,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయుట
12. ప్రతిభను కనబరిచే పిల్లలను గుర్తించి ప్రోత్సాహమందించుట
13. మానసిక శారీరక అభివృద్ధికి అవసరమైన క్రీడలను ప్రోత్సహించుట
రెండో దశ
1. తల్లి తండ్రి లేని పేద విద్యార్ధులకు విద్యా వసతి సౌకర్యము కల్పించుట
2. వృద్ధులకు ,శారీరక,మానసిక,ప్రత్యేక అవసరములు గల వ్యక్తులకు చేయూత నిచ్చుట
3. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టుట
4. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ సహకారాలందించుట
5.శిశు కేంద్ర విద్యాభివృద్ధికి కృషి చేయుట
6. రీడర్స్ క్లబ్,ఫిల్మ్ క్లబ్ చిల్ద్రన్స్ క్లబ్ లను ఏర్పాటు చేయుట
7. రక్త దానము కళ్ళ దానము,అవయవ దానము లను ప్రోత్సహించుట
8. మొక్కలను పెంచడాన్ని ప్రోత్సహించుట
9. పత్రికలు మరియు పుస్తకాల ప్రచురణ మరియు పంపిణి చేయుట
10.ఉపాధ్యాయులు తల్లిదండ్రులు యువకులకు అవసరమైన శిక్షణలనిచ్చుట
11. ఫ్యామిలీ గైడెన్స్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయుట
12. పౌర గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయుట
13. సంస్థలో సభ్యులను పెంపొందించుకొనుచూ సభ్యులందరూ సంస్థ అభివృద్దికి కృషి చేయుట
మూడో దశ
1. స్ఠల సేకరణ మరియూ నిర్మాణముల ఏర్పాటు

21 నవం, 2010

పిల్లలతో ఇలా కూడా చేయించవచ్చు

ఇవాళ పిల్లలకు అందించే విద్య అవసరమైన విద్య కాకుండా పోయింది.ఇలాగ పిల్లలను ప్రోత్సహిస్తే చదువులపై ఇష్టం లేకుండా పోతుందా!పిల్లలు ఇష్టపడేది సృజనాత్మక కృత్యాలే కదా!ఆపైనే చదువులు.ఇవాళ బడులు,ఉపాధ్యాయులు పిల్లలకు కావాల్సిన దానిని వదిలేసి వాళ్లకు చదువులు రావడం లేదని ఖైదీలను కొట్టినట్టు కొడుతున్నారు.మరి దీనిని గురించి మనము ఆలోచించ వద్దా !
అందుకే ఇలాగా .













శాంతివనం బడులలో పిల్లలతో

బడి బతుకు బండ బారి పోతుంది
పంతులు పద్యం కావడము లేదు
వాతావరణం వేడెక్కి పైరగాలిని కొండ పైకి
ఎక్కిస్తున్నది
పిల్లలకు నోట మాటే రావడము లేదు
కథలు కల్లలైపోయాయి
కలలు కనే కళ్ళే మాయమయ్యాయి
రేపటి గురించి ఇవాలే బెంగ
ఇదేనా చదువంటే

భవిష్యత్త్ ఇంతగా బండబారి పొతుందేమిటి
ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడ కుండా వుందామా

అందుకే శాంతివనం లో ఇలా


























సృజనాత్మకత మనిషికి అవసరం కదా
















మాట్లాడ్డం ఒక కళ కదా