11 జూన్, 2011

నగరంలో దారి తప్పిన మనుషులు


నగరంలో మీరుఅటో ఇటో తిరుగుతున్నప్పుడు
ఎక్కడైనా రోడ్డు మీద నీరు కావి పంచె కట్టు కనపడితే
చీదరించుకుని తలలు తిప్పుకుని పోవొద్దు
వాళ్ళు అంతకు ముందెప్పుడో
మన నాన్నలో అన్నలో అయి వుండొచ్చు

మనం తొక్కుకుంటూ తోసుకుంటూ బస్సులెక్కుతున్నప్పుడు
మట్టి వాసన వేసే మనుషులు కనిపిస్తారు
వాళను చూసి నొసలు చిట్లించుకోవొద్దు
వాళ్ళు మన తాతలు ముత్తాతల్లాంటి వాళ్ళు కావచ్చు

గడ్డాలు పెరిగి మట్టి గొట్టుకు పోయిన మనుషులు చెయ్యెత్తితే
ఆటో వాడికైనా ఈసడింపు పుట్టొచ్చు
కాస్త ఆటో ఆపి వాళ్ళను ఎక్కించండి
వాళ్ళు మనకు అన్నం పెట్టి కడుపు నింపే రైతన్నలు కావొచ్చు
నగరం అరణ్యం కదా
ఆ అరణ్యంలో దారి తప్పిన దానయ్యలు
నోరు పిడచ కట్టి అడ్డం పడి పోవొచ్చు
కాసిని మంచినీళ్ళు మొహాన కొట్టి లేపండి
వాళ్ళు అనంత దయామయులైన పల్లె ప్రవక్తలు కావొచ్చు

మనసు వదవద లాడుతూ
వొళ్ళంతా చెమ్మతో తిరిగే మనుషులు కనబడతారు
బండరాళ్ళ మన కంటికి మనుషులుగా వాళ్ళు కనబడక పోవొచ్చు
వాళ్ళను చూసి మనుషులెలా వుంటారో కాస్త గుర్తుకు తెచ్చుకుందాం
మానవత్వం తప్ప మరేమీ తెలియని వాళ్ళు కావొచ్చు

తిక్కల తిక్కలగా దిక్కులు చూసే అరవ్వోళ్ళు కనిపించొచ్చు
వాళ్ళని పిచ్చివాళ్ళ కింద జమ కట్టొద్దు
వాళ్ళు ఇంటింటికీ వూరూరికీ
రహదార్లేసిన రాయబారులు కావొచ్చు

శాంతివనం ఫ్రీ సమ్మర్ కేంప్లో పిల్లలు రకరకాల ప్రతిభ కనబరిచారు

శాంతివనం ఫ్రీ సమ్మర్ కేంప్లో పిల్లలు రకరకాల ప్రతిభ కనబరిచారు
.వాళ్ళళ్ళొ వుండే సృజనాత్మకతను చంపేసి వాళ్ళను మర యంత్రాలుగా మార్చేస్తున్న దోషులం మనం
.అందుకే ఒంగోల్లో పిల్లల తరపున శాంతివనం పనిచేస్తుంది
.సమ్మర్లో నెల రోజుల పిల్లలకు ఆట ,పాట, బొమ్మ ,మోడల్,తయారీలో శిక్షణనిచ్చాం
.పిల్లలు ఏదైనా చెయ్యగలరని నిరూపించుకున్నారు.