సతత హరితానికి
మూలమూలల్లో
విస్తరించే గ్రీష్మం
ఎంత జడివానైనా
ఇట్టె పీల్చేయగల
ఇసుక పర్ర
ఎటువైపు ఎగురుతున్న
శ్వేత కపోతాన్నయినా
కూల్చేయగల
కరుకు ముక్కుల రాబందు
ఏ బంధాను బంధాలనైనా
తెగ నరికే రాక్షస ఖడ్గం
కురిసే విరిసే వెన్నెల్నిండా
చీకటి బెడగొండలు నింపే
పెను ఉత్పాతం
తాగే తాగే నీళ్లనిండా
కటిక విషాన్ని చిమ్మే
రాకాసి బల్లి
ఒక ఉన్మాదానికి
పూసిన
పిచ్చి జిల్లేడు పువ్వు
వెన్నెల మెడలపై
విషపు కత్తులు దించిన
రాతి గుండెల చప్పుడు
ఆయుధాగారాలను
ఆకలి కేకల సోమాలియాలకు
అరువిచ్చే విఫణి వీధి
ఏ సస్యశ్యామలాన్నయినా
మట్టి కరిపించే
ఎడారి
దేదీప్యమానమైన
వెలుగును చిదిమి
చీకటి కమ్మే అమావాస్య
సూర్యోదయాల కంట్లో
శుక్లాలు పూయించగల
గాడాంధకారం
వేల కలల్ని
భగ్గున మండించి
బూడిద చేసే నెరజాణ
ఏ రాత్రినీ
కలవరింతలు లేకుండా
తెల్లారనీయని పీడకల
పసి చిగురు టాకుల్నీ
టపటపా రాల్చేయగల
ఉన్మాది
నిలువెత్తు సంపదల్నీ
ఏట్లో విసిరేయగల
పిచ్చెక్కిన ఆధునిక శాస్త్రవేత్త
ఒకే పుర్రెను నింపిన
వేల దుష్టాలోచనల
చవిటి పర్ర
గుండెలనిండా
ఉక్కునాడాలు నింపుకుతిరిగే
జవనాశ్వం
పగ్గాలు తెంచుకుని
దూసుకుపోయే
రేసు గుర్రం
ఏ అపరాత్రో
నిదుర మబ్బులతో
పట్టిన దావాద్రి
తీరని కాంక్షల
కాలూ చెయ్యూడనీయని
హిట్లర్
ఒక వియత్నాం
ఒక ఆప్ఘనిస్తాన్
ఓ ఇరాక్
ఓ ఇజ్రాయిల్
ఒక అమెరికా
ఏ సమూహ గానాన్నయినా
తుంపులు తుంపులు చేసే
సుడిగాలి వడగాలి
ఆకాశాన్నీ పాతాళాన్నీ
చిటికెలో మాయం జేసే
మాయల పకీరు
భేతాళ మాంత్రికుడు
పచ్చగా సువాసన్లతో
విరగ్గాసే
మామిడి ప్రపంచాన్నిండా
సొనలు నింపే విష పాత్రిక
గాయాలు గాయాలుగా
నెత్తురు వరదలై పారించే
వరద ఉరవడి
పావురాల్నీ రామచిలకల్నీ
జెముడు కాకులుగా మార్చేసే
కాటిపాపడు
రూపాయి బిళ్ళపై
బొమ్మ బొరుసూ
రహస్యం విప్పి చెప్పే
రంగు రంగుల మాయావి
కొలిమిలో బెట్టి
మనిషిని సాగ్గొట్టే
ఎర్రగా మండే నెగడు
ఈ యుద్ధం
ఓ తీతువు కూసిన నేల
ఓ గుడ్లగూబ చూపు
ఓ కాష్ఠాల గడ్డ
ఓ చీకటి గుయ్యారం
ఓ తోడేళ్ళ స్థావరం
ఓ పులి గుహ
ఒక రాక్షస చూపు
23 మార్చి, 2010
16 మార్చి, 2010
తెలుగు సమాజాన్ని రక్షించుకుందాం
ఏ భాషా సమాజమైనా తన పిల్లలకు మాత్రుభాషలోనే విద్యాబోధన జరగాలని కోరుకుంటారు .కానీ మన తెలుగు సమాజం ఆంగ్ల చదువుల మోజుతో పిల్లలను నరకయాతన పెడుతున్నారు. నిజానికి మాతృభాషలో చదువు కుంటే ఏ భాషలోనైనా ప్రావీణ్యం పొందవచ్చు . అది మేము అనుభవంతో తెలుసుకున్నాము .అలా చదువుకున్న పిల్లలు ఆంగ్లం బాగా నేర్చుకోవడం గాక సృజన ప్రక్రియలో కూడా ముందే ఉంటారు .అది తెలియని పాలకుల నిర్ణయాలతో మనపిల్లలు పిచ్చివాల్లుగా మారి భవిష్యత్తు గురించి ఆలోచించే శేక్తి పోతుంది .ఇప్పుడు కూడా మనం ఆలోచించక పొతే మన పిల్లలను అజ్ఞానులుగా మన చేతులతోనే మార్చి వేస్తాం .మనం మేలుకుందాం .కనీసం ప్రాధమిక విద్యనైనా మన భాషలోనే నేర్పాలని అది రాష్ట్రమంతా అమలు జరిగేలాగా ప్రభుత్వమే చర్య తీసుకునేలాగా వత్తిడి తెద్దాం .మావంతుగా ఒంగోలులో రీడర్స్ క్లబ్ ,పిల్లల కథలు చదవడం,కొనిపించడం , పాఠశాలలకు వెళ్లి పిల్లలకు తెలుగు తీపి తెలియ చెయ్యడం ,యువకులతో తెలుగు చదివించడం ,పర్యావరణ అవగాహన కలిగించడం వంటి పనులతో ముందుకు నడుస్తున్నాం. మేరూ చెయ్యి కలపండి.మనం సాధిస్తాం .
15 ఫిబ్ర, 2010
9 జన, 2010
3 జన, 2010
ఈ కొత్త సంవత్సరము ఎన్నెన్నో ఆశలు ఆశయాలతో
మొదటి రోజే ఎందరికో కొత్త సంవత్సరం
ప్రతి క్షణాన్నిప్రతి రొజునీ అర్ధవంతంగా ఆలోచించేవారికి
ఎపుడూ ఆనంద సంవత్సరమే
అనుకున్నది ఆచరించే వారికి అనుసరనీయ సంవత్సరం
సమూహ దృష్టి కలిగిన వారికి సామాజిక సంవత్సరం
కళాత్మకంగా కవితాత్మకంగా జీవించేవారికి సాహితీ సంవత్సరం
సంబంద బాంధవ్యాలతో నిత్య హరితంలా జీవించే వారికి సాహితీ సంవత్సరం
విషాదంలో కూడా ఫక్కుమని నవ్వేవారికి ఆనందమైన సంవత్సరం
పక్కవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ బతికే వాళ్లకు పరమానంద సంవత్సరం
ప్రకృతిలో తన్మయత్వం చెందే వాళ్లకు అనుభూతి సంవత్సరం
దూరదృస్టి కలిగి కాలాన్ని సద్వినియోగించే వారికి లక్ష్యాల సంవత్సరం
ధ్యేయం తో మందుకు నడిచే వారికి అర్ధవంత సంవత్సరం

28 డిసెం, 2009
మాసాహస యాత్రలు
హిమాలయ యాత్ర ఫోటోలు
http://picasaweb.google.co.uk/manchikanti04/UntitledAlbum#
ట్రెక్ ఎక్ష్పొ
http://picasaweb.google.co.uk/manchikanti04/Thaar#

23 డిసెం, 2009
ఈరాజకీయ దివాలాకోరుతనము కాదా
అంతా లోపాయకారితనమే. ఒక వైపు తెలంగాణా ఇస్తాము అనడము .ఇంకో వైపు సమైక్య ఆంధ్రా ఉద్యమానికి పొగపెట్టడము .లో గుట్టు పెరుమాళ్లకు ఎరుక .అన్నట్లుగా ఉంది ఆంధ్ర రాష్ట్రము లో రాజకీయ తతంగం .ఇవ్వాల్సినహక్కులు ఇచ్చేస్తే ఎంతో కాలముసంపాదన అంతా పోతుందన్నది సమైక్య వాదుల బాధ .ఇప్పటి దాకాసంపాయించినది మునిమనవళ్ళ దాకా సరిపోతుందిలే అనుకుని వొదిలి పెట్ట వచ్చు కదా 'అదేం కుదరడం లేదుఎందుకంటే అధికార దాహం.దీని కోసం ఎవరినైనా వొదులుకునే రాజకీయ నాయకులు ముందూ వెనుకా ఆలోచించేపరిస్తితిలో లేరు .
తెలంగానాలో నిరాహార దేక్ష ఎంత ఫార్సు గా జరిగిందో అంతకంటే వెయ్యిన్నొక్క రెట్లు నాటకాల వాళ్ళు రాయలసీమఆంధ్రా లో బయలు దేరారు .అందరు బజారునపడి కొట్లాడుతున్న తెర వెనుక రాజకీయం తెర వెనుకే జరుగుతుందిఅర్ధం కాని అర్ధం చేసుకోలేని సామాన్యుడే ఇప్పుడు అమాయకుడు.
తెలంగాణా వాళ్ళకేదో అన్యాయం జరుగుతున్దంట కదా వాళ్ళ మానాన వాళ్ళని వదిలి వేద్దామంటే అయ్యో ఇన్నిసంవత్సరాలుగా అభివృద్ధి చేసిన హైదరాబాద్ ని వొదిలి పెట్టడమా ససేమిరా అంటున్నారు సమైక్య వాదులు.అంటే ఏదోపోతున్దనేగా;ఏమి పోతుంది.ఎవరిది పోతుంది.ఎంతవరకు పోతుంది. ఇది సామాన్యుడికి అర్ధం కాని ప్రశ్న .సరే తెలంగాణావచ్చింది అనుకోండి ఎవరికీ వొరుగుతుంది అంటే అక్కడ సామాన్యుడికి అర్ధం కాకుండానే ఉంది.ఒక వేళ ఇస్తే అప్పుడుకూడా సామాన్యుడికి కొట్లాట ఎట్లాగూ తప్పదు .కాకుంటే ఈసారి తెలంగాణా పెట్టుబడిదారులతో .అంటే మొత్తంమీద ఎఉద్యమం కూడా ప్రజల చేతులలో లేదు.కేవలం నాయకులు ఆడుకుంటున్న జూదంలో సామాన్యులు నలిగిచస్తున్నారు.అయితే వీటి మధ్య మేధావులు కూడా అర్ధం లేని వత్తాసులు పలకడం బాగా లేదు.
మధ్య మధ్యలో రకరకాల పాత్రధారులు రకరకాల వేషధారులు ,రంగురంగుల పార్టీలూ అన్ని రంగంలోకి దూకిపోఇన పదవులూ వస్తాయనుకున్నసింహాసనాలూ అన్నిటిని తలుచుకుని తలుచుకుని వెక్కిళ్ళు పెడుతూ మరి రోడ్లపాలయ్యారు .వీళ్ళుఅయితే అయ్యారుకాని ఏమి తెలియని అమాయకులను కూడా రోడ్ల పాలు చేసారు.ఈ మద్యలోఅత్యుత్సాహం ప్రదర్సించే కొందరు అమాయకులు ప్రాణ త్యాగాలూ బలిదానాలూ అంటూ ఆహుతి అవుతూ ఉన్నారు.
మా అభిప్రాయం చెప్పేసాము మీరే తన్నుకుచావండి అంటూ పైనున్న కామందుల వారు తెలియనట్టు చూస్తూదోబుచులాడుకుంటున్నారు.ఏది ఏమైనా తెలంగాణా ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కేంద్రం అనుకూల అననుకూలపరిస్తితులూ వారిని పరిపాలించే ప్రపంఛ బాంక్ అధిపతుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది.
ఎవరు ఏం ఛేసినా ఎవరికీ లాభనష్టాలు వచ్చినా ముమ్మూర్తులా నష్టపోయేది మాత్రం సామాన్యుడే.ఈ బందులూదిక్షలలో నష్టపోయిన మొత్తాన్ని సామాన్యుడి నెత్తి మీద ధరల రూపములో పడడం మాత్రం ఖాయం.ఈ పాపం ఎవ్వరిదనిఅందరూ ప్రశ్నించాలి .అందుకే ఏదైనా ప్రజలే గోదాలోకి దిగే సాధించుకోవాల్సిందే కాని రాచకీయ నాయకులప్రాపకంతోనో,జాలీ దయల్తోనో వస్తుంది అనుకుంటే అంతా వొట్టి మాయా బజారే. . .

16 డిసెం, 2009
26 నవం, 2009
మత్తులోకి లాక్కెళ్ళి ప్రేమలోముంచెత్తే శరచ్ఛంద్ర ఛాయ-బంధన ఛాయ
గ్రీష్మతాపం పెచ్చరిల్లుతున్న అకవిత్వపు కాలంలో, హృదయాల నుండి హృదయాలకు సన్నజాజి పరిమళం వంటి సమ్మోహనపు సమయాలు కొడిగడుతున్న కాలంలో కవిత్వమంటే కేవలం దేహ సంబంధమైనదే అనుకుని పైపై మాటలతో వ్యాకరణాంశాలుగా మారిపోయిన గ్రీష్మతాపంలో బంధన చాయ చిరు జల్లై మనోవల్మీకంలోకి జొరబడిపోయింది.
నిద్రరాని రాత్రులకు, గాయమైన మనసులకు, భౌతిక సంబంధమైన వాంఛలకు దూరంగా ఐహిక సుఖమయ జీవితం నుండి తెలియని లోకాలకు పరుగులు తీయిస్తూ తన వెంటే సమ్మోహన లోకంలోకి లాక్కుపోయిందీ లేత మావి చిగుళ్ళ వసంతంలో ఎలకోయిల గాత్రం.
మనిషి ఎంతదాకా పరుగిడతాడు. ఎంత దూరం పరుగెడతాడు. అంతూ దరీ తెలిసేదుందా! అని పదే పదే ప్రశ్నించు కుంటున్నప్పడు ఇదుగో పరుగు ఆగడానికొక మంచుపూల చల్లదనం అని నిలవరించి పట్టు పరుపై కూర్చోబెట్టి, నీలగిరి తైలాన్ని మర్ధన చేస్తూ కమ్మని మాటల మధూదయాన్ని, గోధూళివేళ సంధ్యా సమయాల్నీ తెరపై చిత్రిస్తూ జీవితం మధురిమ నంత అప్పటి కప్పుడు మన కళ్ళ ముందుంచి, జీవిత మంటే ఏమిటో తెలిసిందా అది ప్రశ్నిస్తుందీ కవిత్వం.
ఏకాంత రాత్రి మువ్వల ధ్వని/నిమ్మళించిన సముద్ర తీరంలో / వందనీయ దివసాన్ని పరవశంతో ముద్దు పెట్టు కోవడం ఎంతమందికి సాధ్యమౌతుంది.
తాత్కాలిక బంధాలతో ఆ మాటకొస్తే అసలు అనుబంధాలే తెలియని లోకంలో శాశ్వత బంధాలతో ఉప్పొంగి పోతున్నాను. ఈ జీవితోత్సవ పర్యంతం ఒకింత మైకం కమ్మిన ప్రతీక్షలో ఊరేగుతున్నాను… ప్చ్ జీవితాన్ని ఉత్సాహవంతంగా ఉత్సవం చేసుకోవడానికి తడితడి హృదయాల కోసం ఎక్కడెక్కడని వెతకాలి. ఇవాళ నిజమైన జీవితాన్ని అనుభవించే మనిషి కోసం కారడవులు పట్టుకు వెతకాల్సి వొస్తుంది. ఎంత సుదీర్ఘజ్ఞాపకం గరగ నిండా.
ఒకే పోలికలున్నా/ సీతాకోక చిలుకల్ని/ చూడడంతో గడచిపోతుంది/ నిన్నటిలా ఇవాళ కూడా / ఆనవాలు పట్టి/ సమ్మిళిత సుదూర జ్ఞాపకాల్ని / మృదువుగా విప్పుతాను ఒకటొకటి కనురెప్పలపై వాలిన సీతాకోక చిలుకల రెక్కల్ని కర్కశంగా తుంచి రాక్షసత్వం చూయించే మానవ జాతి పెరిగిపోయిన లోకంలో ఎన్నెన్నో సీతాకోకల్ని చూడడంతో కాలం గడిచిపోవడం ఎంతదృష్టం మనిషికి. అంతకంటే అనుభూతి పొందే సమయాలుంటాయా ఈ లోకంలో దమ్ము చేసిన వరిచేనులో కొంగల సమూహం/ అలికి ముగ్గులేసిన ఇంటివాకిట గోరింకల సల్లాపం / సెలయేటి వడిలో పడి కొట్టుకు పోయే దూరప్రదేశపు లకుముకి పిట్టల జంట/ నిండు పారవశ్యంతో పెల్లుబికిన కోకిల పాట - ఎంతటి కల కూజితాలవి కవి నిరతరం దృశ్యాలను వెంటాడుతూనే ఉంటాడా ఏం. నిదురలోనూ మెలకువలోనే కలవరింతలు పెట్టే ఎన్నెన్ని కలలు పాటలు పాడతాడిలా. నిశ్శబ్ద వ్యాత్త ప్రవాసం వదలి / ఏప్రాచీనారణ్యంలోనికి చేయి పట్టి లాక్కు పోతాడో అనిపిస్తుంది.
మనకు ఇష్టమున్నా లేకున్నా తనే చేయి పట్టుకుని ఎండుటాకులపై ఒక్కో అడుగులో అడుగేయిస్తూ కనులు మూసుకుని అతని వెంటే మార్మికలోకపు అంచుల్లోకి లాక్కెళ్ళుతూ చిగురుటాకులు తినిపిస్తూ, దివ్య లోకాలు చూయిస్తూ కలలోలా మాట్లాడిస్తూ ఎంత సమ్మోహభరితం చేస్తాడో కవి.
మలి సంజ అలలమీంచి/నునులేత చీకటి / సరుగుడు తోటలో / ఒక్కొక్క వెండి మువ్వ విప్పారిన నీలిమ తెరిచాపని / శూన్యా కాశమ్మీదకు ఎగురవేస్తాడీ సరంగు / మనలో పలుతావుల్లో మేలుకునే సజీవ నిశ్శబ్దం / అగాధ రాత్రి పర్యంతం.
ఎన్నెన్ని అగాధాలు మనలో. నిర్జీవంగా సంచరించే మనుషుల్ని పిలిచి, చేసైగతో కూర్చోబెట్టి, కనుసైగతో తను అనుకున్న లోకంలోకి మనిషి నిజంగా అనుభవించే రాగాలను అందించి ఇదే కాదా నిజమైన జీవితం. ముమ్మాటికీ ఇదే అనిపించే చంద్రరశ్మి శంఖధ్వని కదా ఈ కవిత్వం.
ఆమెకై అతను అతనికై ఆమె ఎన్ని ఒంటరి ఎదురు చూపుల / రెపరెపల దీపస్తంభాలౌతారు. ఎంత కాలం ఎదురు చూస్తే నేమి, ఎన్ని సార్లు కలుసుకున్నా ఆరని తమకం ఎదురు చూపుల పూలతోటలో పూ సవ్వడలు వినిపిస్తాయి. పూల సుగంధాన్ని పూయిస్తాయి. నిన్ను తలుచుకుని / ఇవాళ తప్పక వస్తావని / లోపల్లోపల మురిసిపోయి / నీలం జ్వాలల్లే నవ్వు కోవడం లో ఎన్నెన్ని జ్వాలలు పూయిస్తాడీ కవి ఒంటరి మనిషి ఎదురు చూపుల అంచుల్నుండి.
రెక్కలు విరిగిన సీతాకోక చిలుక / కడపటి రెపరెపలుగా/ పలవరింతలు నిరీక్షణలో లీనమై / చీకటికి లేని / నీలం గంటల పువ్వొకటి / తొలి జామునే విరబూయటం ఎంత గొప్ప చమత్కారమో కదా! ఓ కవీ కన్నుల నిండా పువ్వుల్నీ, సీతాకోక చిలుకల్నీ, కాలి అందియల్నీ, కన్నీళ్ళలో కూడా పూసే గరిక పువ్వుల్ని ఎన్నెన్నో సృష్టిస్తావు. మకిల పట్టిన మనసు వాకిట కళ్ళాపి చల్లి ముగ్గేస్తావు. మూసుకుపోయిన కన్నుల్ని బలవంతంగానైనా తెరిచి చిత్రాలు పూయిస్తావు.
పట్ట పగ్గాలు లేని కాంచనమృగాలను రోజుల్లోకి అనువదించి / ఇనుప తీగెలు, నీల రక్త నాళాలూ కలగలిపి అల్లిన అల్లికలో ఎన్నెన్ని ఆకారాలు దర్శన మిస్తాయో బహుకాల పక్షిగానం / చెల్లా చెదిరి పోయే జ్ఞాపక పుంజం /దైనందిన పరిహాస ధూళి, వచ్చీ రాని మాటలతో, ఆత్మీయ బాంధవంతో ఎన్నెన్ని కవి సమయాలతో పూల గాయాలకు లేపన మద్దుతాడో ఈ చిత్రకారుడు. కవి కుంచెతో ఇన్నిన్ని దృశ్యాల్ని చిత్రీకరిస్తాడంటే నమ్మాలా వొద్దా! కళ్ళ ముందు ఇంత పచ్చి నిజ నీరెండలా తారట్లాడుతుంటే తప్పుతుందా కలలో జ్ఞాపకం లాగా.
నది దాటుతోన్న పడవలో నీకు మాత్రం అర్థమయ్యే అపేక్షలు / పొగమంచులో కలిసి మెసిలే ఈదురు గాలులు / నిడుపాటి రెల్లుపొదల నడుమ కాలిబాటలు దీర్ఘ స్వప్నాల అసహన పద ధ్వనికి నిమ్మళించిన గొంతుకలు వీటన్నిటి కోసం పరుగులు తీస్తే మాత్రం దొరుకుతాయా కఠినశిలలు కమ్మిన మాయ లోకంలో ఎన్ని సార్లు వగచినా కవికి దొరుకుతుంది కట్టుమట్లుపై కట్టు గొయ్యలకు కట్టిన పశువాసనలే. ఈ మాయాదారి లోకంలో మనషికి కావసిందేమిటో తిరుగు ప్రయాణంలో కళ్ళకు కడతాడు.
కుంకుమ రెక్కల సీతాకోక చిలుకల్ని, పొట్ట చేత్తో పట్టుకుని నవ్వే నవ్వుల్నీ, చీరంతటా విస్తరించిన ముద్దబంతి వువ్వుల్నీ దివా స్వప్నాలలోకి దించిన దాకా వంచిన తల ఎత్తని సృజన కారుడు ఎన్నెన్ని కలలు కంటాడో!
దేహతీరంలో ముద్దులు మూటకట్టుకొని కల్యాణ బంధమేదో ఊపిరితో అల్లుతాడు మోహపూరిత మాయా రాత్రిని తన తోవన తెల్లవారుస్తాడు. తేనియ కలలను కౌగిలింతల పర్యంతం చేస్తాడు. కవి ఒక చోట, ఒక సమయం, ఒక దృశ్యం అని కాకుండా ప్రతి చోటా తానే దృశ్యమై కనిపిస్తాడు. మనిషి ప్రతి క్షణాన్నీ ఎలాగ అమృతమయం చేసుకోవాలో దగ్గర ఉండి దృశ్యాన్నిండా మాలలల్లి, మనిషిని తన వనంలోకి ఆహ్వానించి సేద తీరుస్తాడు. ఎన్నెన్ని బాధల నుండో బంధ విముక్తుణ్ణి చేస్తాడు.
నిదురరాని ఎన్నెన్నో రాత్రులకు నిన్నెన్నో దివా స్వప్నాలతో జోలపాడతాడు. కలలు కనని మనిషిని తట్టి లేపి, కలల్ని కళ్ళల్లోకి వొంపి సేద తీరుస్తాడు. మనిషి అంతరంగాల్లో జొరబడి వలయాలు సృష్టిస్తాడు. ఖండితాంగాల వినిమయ విపణి నుంచి మనిషిని కాలూసేతులూ కూడ దీసుకుని స్వేచ్ఛ గానాన్ని ఆలపించమంటాడు. అరచేతుల్లోకి తీసుకున్న నిప్పుమీది నివురును కూడా సున్నితంగా ఫోటో తీసి చూయించే ఈ కవిత్వం బాధల మనసుకి వెన్నపుసని లేపనమద్దుతుంది. గాయాల నదికి నావల్ని అడ్డు కట్టలు వేయిస్తుంది. సుళ్ళు తిరుగుతున్న బాధల సందర్భంలో జీవన రహస్యాల్ని చెవిలో ఊది, సున్నితమైన పెదవులపై చిరునవ్వులు పూయిస్తుంది.
భౌతిక జీవితాన్ని వదలి మనిషి అంతరంగపు లోయల్లోకి పురా స్వప్న సౌధాల్లోకి, తనువును కరిగించుకుని, మనిషిని మంచుగా మార్చి, హృదయాన్ని పరిమళ భరితం చేసుకునే దివ్యగానమేదో అనువణువునా తన కవితల్లో వీణియ మీటుతాడు. పిల్లన గ్రోవితో సమ్మోహన పరుస్తాడు. శబ్దాలు లేని గానాన్నే దోసిట్లో వారబోస్తాడు. ఎప్పటెప్పటివో జారిపోయిన కలల్ని పోగు చేసి మూటకట్టి భుజాన వేసి ఇక బయలు దేరమంటాడు జీవన రహస్యాల్ని ఛేదించడానికి
జీవనసారం తెలియని ఎందరో బాట సారులకి బాటలు చూపి పచ్చికబయళ్ళు లో సేద తీరమంటాడు. లోకం తెలియని అమాయకులను తన మర్మలోకంలోకి మాయగా ఎగరేసుకువెళతాడు. తెగిన గాలిపటాలకు దారం పురిపేని గాలిలోకి ఎగరటం నేర్పిస్తాడు.
ప్రకృతిలో అందాలు చూడని వాళ్ళ దగ్గరగా వొచ్చి సూర్యోదయాన్ని చంద్రోదయాల్నీ, తెలిమబ్బుల ఛాయనీ, కురేసే వానల్లో తడిసే కొంగల్నీ, ఎగిరే పిల్లన్నే నడిచే పడవల్నీ, వడివడిగా పారేసెలయేరుల్నీ, కాంతిమయ ఇంద్రధనుసుల్నీ చూయిస్తూ ఇక ఇలా బతకండని ఇంకో కొంగల బారు దగ్గరకు వెళ్ళి కలల్లోకి కూరకుపోవడంలో నిమగ్నమౌతాడు.
ఈయన స్వప్నాల్ని దోసిళ్ళతోనూ, దృశ్యాలను కౌగిళ్ళితోనూ బంధించడంలో బహునేర్పరి. పురాతన కాలాల్ని వర్తమానాల్లోకీ, వర్తమానాలను భవిష్యత్తులోకీ పరుగెత్తిస్తూ, వాటి వెంటబడి తానూ పరుగెత్తుతాడు.
ఒంటరి జీవితాలకు ఆలంబనౌతాడు. స్థిర జీవితాలకు పరిచయ వాక్యాలు నేర్పిస్తాడు. బతకడం చేతకాని కళాకారులకు కళల నైవైద్యం ప్రసాదంగా పంచుతాడు. యవ్వనాలను వీడిన వాళ్ళకు యవ్వనాలు పూయడం నేర్పుతాడు. య్వవనంతో విర్రవీగే వాళ్ళకు పూల సవ్వడులు వినడం నేర్పుతాడు. పసిబిడ్డలకు చెట్లు ఎక్కడం నేర్పుతాడు. చెట్లకు పసిబిడ్డల భాష నేర్పుతాడు.
మొత్తంగా తానొక ముకుళిత కలువల కన్నీరింకని కొలలనును అంటూ తనను తాను తడితడిగా తడుముకుంటాడు.
వ్యాకరణాంశాలు, అలంకారాలూ, దృశ్యాలూ, ఆకారాలూ ఎన్ని కావాలంటే అన్ని పోగుచేసుకోవొచ్చు కానీ ఈ కవిత్వంలో దిగి అలుపు వొచ్చినంత సేపు ఈది వొడ్డుకు వొచ్చెసరికి మళ్లీ రారమ్మని పిలిచే ఈత కొలను. ఎంతని పరవశించను. ఎన్ని మార్లని పలవరించను. ఇది వీడిపోని స్వప్నం. వదిలివేయని నేస్తం. అంటి పెట్టుకునే హృదయం ఎన్ని సార్లయినా ఎంత దూరమైనా నడిచి వెళ్ళే బంగారు బాట. కవిత్వ ప్రేమికులను బంధించే బంధన చాయ.
*
ప్రతులకు : బంధన ఛాయ రచయిత - నామాడి శ్రీధర్, అంబాజీపేట, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్, పిన్ - 533214, వెల రూ.50/- ఫోన్ 9396807070

19 నవం, 2009
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)