21 నవం, 2010

పిల్లలతో ఇలా కూడా చేయించవచ్చు

ఇవాళ పిల్లలకు అందించే విద్య అవసరమైన విద్య కాకుండా పోయింది.ఇలాగ పిల్లలను ప్రోత్సహిస్తే చదువులపై ఇష్టం లేకుండా పోతుందా!పిల్లలు ఇష్టపడేది సృజనాత్మక కృత్యాలే కదా!ఆపైనే చదువులు.ఇవాళ బడులు,ఉపాధ్యాయులు పిల్లలకు కావాల్సిన దానిని వదిలేసి వాళ్లకు చదువులు రావడం లేదని ఖైదీలను కొట్టినట్టు కొడుతున్నారు.మరి దీనిని గురించి మనము ఆలోచించ వద్దా !
అందుకే ఇలాగా .













శాంతివనం బడులలో పిల్లలతో

బడి బతుకు బండ బారి పోతుంది
పంతులు పద్యం కావడము లేదు
వాతావరణం వేడెక్కి పైరగాలిని కొండ పైకి
ఎక్కిస్తున్నది
పిల్లలకు నోట మాటే రావడము లేదు
కథలు కల్లలైపోయాయి
కలలు కనే కళ్ళే మాయమయ్యాయి
రేపటి గురించి ఇవాలే బెంగ
ఇదేనా చదువంటే

భవిష్యత్త్ ఇంతగా బండబారి పొతుందేమిటి
ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడ కుండా వుందామా

అందుకే శాంతివనం లో ఇలా


























సృజనాత్మకత మనిషికి అవసరం కదా
















మాట్లాడ్డం ఒక కళ కదా
















మానవత్వమున్న మనమేనా ఈ చదువుల నరకంలోనా
















పిల్లల్లో పెద్దల్లోనూ ఎంతో ఉత్సాహం


ఎంత మంది పిల్లలుఇ
కార్ఖానాలలో బతుకులు
అందరికి తెలిసిన నరకమే
అయినా ఎంత ఆనందమో
జీవితంలోకి ప్రవేసించాక
అంతా సూన్యమే








7 నవం, 2010

బడిలో పిల్లలు సృజనాత్మక కృత్యాలలో

ఉపాద్యాయుల్లో కూడా ఎంత ఉత్సుకతో!ఇలా కూడా పిల్లల్ని ఆనందింప చేయవచ్చా!ఇలా కూడా పాఠాలు చెప్పవచ్చా! వెనుకబడిన పిల్లల్ని తెలుగు భాషతోనూ మరియూ కథలతోనూ ఉత్సాహంగా అభ్యాసన కార్యక్రమములో పాలు పంచుకునే టట్టు చేయవచ్చా !అవును ఇది నిజం .ఎవరైనా చేసి చూడవచ్చు.


కథలు చెప్పడము మన తరతరాల సంప్రదాయము కదా!మరి మనం దిన్ని నిలబెట్టు కోవాల్సిన అవసరం వుంది కదా! అందుకే ఇలా.


పోటిలలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ఎంత ఆనందమో ! కదా మనం ఏమైనా చెయ్యాల్సింది.








పిల్లల్లో సృజనాత్మకత భాషతోనే మొదలవుతుందని భాషోత్సావంలో తెలుస్తోంది.ఎంతో ఉత్సాహంగా కథలు,పాటలు,పద్యాలు,చెప్పడము,రాయడము చేస్తున్నారు.

27 అక్టో, 2010

భూమి తల్లి అన్నపూర్ణమ్మరా!

ఎవ్వరికి మరణ శిక్షలు వరమాలలుగా అవసరము లేదు
ఎ వోక్కరిని ఎన్కౌంటర్ భూతాలూ ఆవహించ పనిలేదు
ఆయేషాలూ,మనిషాలూ,వైష్ణవిలూ
బలవంతపు బాయిలర్లలో బుగ్గి కావాల్సిన పనిలేదు
ఏ ప్రభాకర్లూ గుండెలు పగిలి
చితి మంటల తోడుగా నింగికి పయనించాల్సిన పనిలేదు
తెలుగు నేలనేలంతా విలవిలలాడి పోతుంది
భూమి నుదిటిపై నాగలి సంతకం చేస్తే
గర్భం విచ్చుకుని విత్తనాలకై చేతులు చాస్తుంది
వాన జల్లు వొడిలో చేరితే పరవసించి మొక్కై శిరస్సు పైకే ఎత్తుతుంది
మొక్క పులకరిస్తే కంకులు పాలు పోసుకుంటాయి
అన్నపూర్ణ చేతులు సాచిన వానికి ఆకలి తీరుస్తుంది
భూమిని నమ్ముకోకుండా అమ్ముకు తింటూ ఉన్నందుకు
చిట్టి తల్లుల్ల్ని చిన్ని బాలల్ని బలి కోరుకుంటున్నది
ఒరే నాయనలారా రాజనాలు పండించే భూమిని
తులాభారం తూయకండిరా
పిల్లల మెడలకు నాగుబాములై చుట్టుకుంటాయి

ఒక నెలంతా తెలుగు భాషోత్సవం

నవంబర్ ఒకటి నుండి నెల చివరి దాకా ఒక నెల రోజులపాటు ఒంగోల్లో కళాశాలలు ,పాఠశాలల్లోభాషా మాసోత్సవం నిర్వహించాలని మిత్రుల సహకారం తో ,మరియు శాంతి వనం మిత్రుల ప్రోత్సాహం తొ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.పాఠశాలల్లో పిల్లలతో భాషకు సంబంధించిన కవిత,పద్యం,వుత్తరం,గేయం ,కథా రచన,కథా విశ్లేషణ,ఒకసంఘటన తెలుగులోనే మాట్లాడ్డం,కవిత్వం చదవడం కథ చదవడం,కళాశాలల్లో కథ రాయడం,కవిత్వం చదవడం,రాయడం,మాట్లాడ్డం వంటి ప్రక్రియలు చేయించి వాళ్లకు తెలుగు పుస్తకాలే బహూకరించి నెల చివరలో అన్ని పాఠశాలలు ,కళాశాలలకు కలిపి పోటీ పెట్టి వాళ్ళనుండి రచయితలుగా స్పార్క్ వున్న
వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాము.
ఇలాగే తరువాత కూడా ప్రతి ఆదివారము వర్క్ షాప్ లు నిర్వహిస్తూ ఒక వాతావరణాన్ని కల్పిస్తూ పిల్లలకు తెలుగు పుస్తక పఠనము ఒక అలవాటుగా ,రచన కూడా అలవాటుగా చేసి,పిల్లల పత్రిక మొదలు పెట్టి ,పిల్లల రచనలతోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాము.ఈ కార్యక్రమాలలో పాలు పంచుకునే వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాము.ఇలాంటి ప్రయత్నాలు అక్కడక్కడా జరిగితే కొంతవరకైనా తెలుగు భాష బతికిబట్టకడితే బాగుంటుందని మా ఈ చిన్న ప్రయత్నం.ఎవరైనా మా ఈకార్యక్రమములో పాల్గోనాలన్నా ఇదే మా ఆహ్వానం.